» Story

Trouble viewing in Telugu, click here to Download the Font

 
 
 
 
 
 
 
 
 
 

కాంతూ   కథలు

(కాంతూ  కథలు  -  1)

                                                                             పి. ఎల్. కె. శాస్త్రి

         ఈ మధ్య కాలములో  ముంబయి  మహాపట్టణంలో  మనిషి  వంగుపోవుట, కృశించి పోయి  మెలికలు  తిరిగి పోతున్నాడు. ఆకాలములో  ఊహించలేని, ఈ కాలములోని మైకల్  జాక్సన్  అంతటివాడుగా   అని  చెప్పడంలో  అతిశయోక్తిలేదు. మా వాడు ఉన్నాడులే అందరు  కాంతూ  అని పిలుస్తారు. పుట్టిన  స్థలం  తెనాలిచిన్నప్పటి  రోజుల్లో, వల్లెలో  చెట్టు చిటారు కొమ్మకు  చేరి, కోతికొమ్మంచి  అనే  ఆటలు  ఆడుతూ, పొలాల  వెంబడి  పిల్లిపిసర కాయలు  తుంచి  ఎగరేసుపోయిన   రోజులవి.  అప్పట్లో  ప్రపంచం  అంటే  తెలియక, ఏవవేవో చిత్రించుకుని, ఆకాశంలో  విహరించినట్లు కలలు కనడం, ఆ వయస్సులో  ఉన్న  వాళకు పరిపాటయిపోయింది. అది  కాంతు  మెట్రిక్  ప్యాసైనప్పటి  మాట. అలా  అనుకుని  పక్క వాటాలో  ఉంటున్న  ప్లీడరు గారి  దగ్గిర  గుమాస్తాగా  కుదురుకుని  ఉంటే  ఎంతో  బావుండేది . అనుభవం  చాలని  వయస్సు. సలహా  చెప్పేవారెవరు   లేరు, తోటి దాయాదులు, కాంతూ కలసి  చదువుకుని,  ఆడుతూ  పాడుతూ  ఉన్నప్పటికీ  దాయాదులు   భిన్నంగా నే ఉన్నారు.  స్వలాభమనే   అలవాటు  వారిలో  పెనవేసుకువి  పోయిన  స్థితిలో  కాంతూకి  ఇంకా  కాంక్ష  మనస్సులో  మారుమూల  పెనుగులాడేది. రెండవ  ప్రపంచ యుద్ధం  ముగిసింది, దేశానికి  స్వాతం త్య్రం  వచ్చింది, మరొక  రెండు  సంవత్సరాల  తర్వాత  మంచి మార్కులతో  స్కూల్  ఫైనల్  పరీక్షలలో   కాంతూ  నెగ్గాడు. తాను  ఇన్నాళ్ళు  తల్లితండ్రుల వద్ద  ఉండి  చదవలేదు. చదువు  నిమిత్తం  అమ్మమ్మగారి  ఇంట్లో  దాదాపు  ఆరు  సంవత్స రాలు  ఉన్నాడు, తల్లితండ్రుల  ప్రేమంటే  తెలియని  బాలుడు  (కాంతూ) అమ్మమ్మ  వద్ద పెరిగి ఆమె  చూపిన  ప్రేమ, సహనం, వ్యవహార  దక్షత  గమనించిన  వారు  చెప్పగా  విన్నాడు. అనుభవం  చాలని  వయస్సు  కదా !

   కాంతూ  స్కూలు  ఫైనల్  పూర్తి  చేసిన  తర్వాత  బొంబాయి  (ముంబయి ) లో పైచదువు  నిమిత్తం  అక్కడకు  చేరవలసినదని  వాని  తల్లి తండ్రులు  స్పష్టంగా  చెప్పారు. మాటవరసకు ఎప్పుడో  కాంతూ వాడి స్నేహితులతో తాను  పైచదువులకు   బొంబాయి  వెళ్తాడని  చెప్పి మరచిపోయాడు .  అలాగే  స్నేహితులు  కూడా  దీని  ప్రస్తావన  తేలేదు.

     కాంతూ  బొంబాయి  కి  ప్రయాణసన్నాహాలు   చూచి  స్నేహితులందరికీ   కబుర్లు చెప్పుకునేందుకు   శీర్షిక  దొరికింది .

           వాడూ  చూశావా  బొంబాయి  వెడుతున్నాడు  .

              ఎవడూ 

            వాడే కాంతూ.

              ఎందుకూ , విమానాలు  ఎక్కి  ఆకాశంలో  విహరించడానికేనా  !

              మనవాడికికన్నీ  గొంతెమ్మ కోర్కెల్లే  !

              బాగా  చెప్పావు.

        బొంబాయి  ప్రయాణం  దినం  రానే  వచ్చింది.  వీడ్కోలు  పలకడానికి  కాంతూ 

            బొంబాయి  ప్రయాణం  దినం  రానే  వచ్చింది వీడ్కోలు  పలకడానికి  కాంతూ  స్నేహితులెవ్వరూ   రాలేదు. తాను  కూడా  బాధపడలేదు. తెనాలి లో  ఎల్లంరాజువారు బొంబాయి పార్శీ కాలనీ, దాదరులో  స్థిరపడ్డారు. వారి  సహాయముతో  బొంబాయి  వాస్థవ్యు లైన  పెద్దనాన్నాగారిం  టికి  కాంతూ  చేరాలి. వీరు, వారింటి  పక్కనే  నివాశం. అందుచేత ఇబ్బందులెవ్వరికీ   లేవు. నవనాగరికుల  మెప్పులు  పుష్కలంగా  పొందింది  బొంబాయిఅది  బాగా  డబ్బున్న వాళ్ళ  బొంబాయి. జాగర్త  సుమా  అక్కడ  పట్టపగలే  ఖూనీలు  జరుగు తాయి, అక్కడ  చార్ సౌ బీసులు  ఎక్కువ. ఎవరో  చెప్పగా  మాటలు  చెవ్వుల్లో  రింగురుమని   తిరిగేవి .

     తెల్లవారేసరికి  రైలు  తనని, ఎల్లంరాజుగారిని   బొంబాయిలో  దించింది, ఎత్తుగా  గాలిలోకి ఏడేసి  అంతస్థుల  మేడలు  చూసేసరికి  కొంత  ఆశ్చర్యంచెందాడు. మరొకవైపు  మేడలు  మురికి  కొట్టుకుని, ఒక్కొక్క  మేడలో  చాలా  కుటుంబాలు   జీవంచడం, బాల్కనీలో  చెట్ల తొట్లు  వేలాడుతూపక్కనే  తాడుమీద  ఆరేసిన  బట్టలు వేలాడుతూ కాంతూ చూసి  అసహ్యించుకున్నాడు. ఇది  శిధిల మవుతున్న  బొంబాయి  నాగరికతకి  సరైన  చిహ్నం అనిపించింది  కాంతూకి.

  బొంబాయిలో  కృత్రిమ  జీవితం, ఒకరి  ప్రమేయమే లేకుండా  సాగిపోతుందనే   విషయం  ఆ  నోటా  ఆ నోటా వినగా  తెలుసుకున్న  కాంతూ ఎల్లంరాజుగారు  పిలవడంతో  పరధ్యానం వదలి, ఆయనతో  కారెక్కాడుఆప్పటికే  ప్రయాణీకులు  ఆఫీసు  చేరేందుకు  మనుష్యులు  సమూహంగా  పరిగెడుతున్నారుఈ  జనమంతా  ఎలట్రిక్  లోకల్  కోసరం  పరిగెడుతూ,  తోసుకుంటూ వారివారి గమ్య స్థానం  చేరడానికి  ప్రయత్నం  చేస్తున్నారు   కాబోలు. ఆ  దృశ్యాన్ని  తిలకించడంలో   ఎంతో  మజా  ఉంది. ముందు  ముందు  తనూ  పరిగెడుతాడు.

బొంబాయిలో  మురికి నీళ్ళు  సముద్రంలో   బాంద్రా  అనే  సబర్బు  వద్ద  కలుస్తాయి. అక్కడ దుర్వాసన  దుర్గంధం   చిముతూ  దశదిశాలా  వ్యాపించి   మెలికలు  తిరుగుతూ  పోయే  మురికి  నీళ్ళ పైపులు  కనబడుతాయి 

       ఎల్లంరాజుగా రు  అంటారు  - ఈ  వూళ్ళో  ఉద్యోగం  గండపెండేరం  లాంటిది భద్రత  జటాయువు లాంటిది. కాంతూకి  అర్ధంకాలేదు, మౌనంగా  ఉండిపోయాడు ఇంతలో  నివాశస్థలం  ఆసన్నమైనది ఎవరి  బతుకులు  వారివే  అన్నట్లు  అనిపించింది. అప్పుడే  కాంతూ  తండ్రి  వెంకటప్పయ్యగారు, పెదనాన్నగారు  (నరసింహం గారు ) వీడ్కోలు  పలికారు. చాలా  రోజుల  కలయిక  ఎంతో  త్రిల్ గా ఉంది. పెద్దమ్మ  పిల్లలు  లోనికి  ఆహ్వానించారు. కాంతూ  తల్లికోసం  ఇల్లంతా  వెతికాడు. తండ్రి  అది గ్రహించి, సాయంత్రం  మన  ఇంటికి వెళ్దామని, 10  కిలోమీటర్ల  దూరంలో  విల్లె పార్లా  అనే  సబర్బ  ఉంది  అని నా సమస్య  తీర్చాడుఅక్కడ  అమ్మ, తమ్ముడు, చెల్లాయి  ఉంటారు. ఈ  విషయం  చెప్పి  పెదనాన్న, నాన్న  ఆఫీసుకి  వెళ్ళారు .

జో .  .  .  .  జో .  .  .  .  జో .  .  .  .

(కాంతూ  కథలు - 2)

                                                                             పి . ఎల్ . కె . శాస్త్రి 

    లైబ్రేరియన్  సుబ్బరాజుని   చూసి  ఆరు  నెలలు  గడచి పోయింది.  అతన్ని  చూద్దామని వెళ్తే  మూడు  మాసాలక్రితం   లైబ్రరీ  నుండి  వెళ్ళి  వేరే  ఉద్యోగంలో  చేరినట్లు  తెలిసింది. అనుకోకుండా   జో  అగుపించాడు . విచిత్రమైన  సమాచారమే ! 

    ఎవరైనా  జో  . .  జో .  . జో  . .  రెండు,  మూడు  సార్లు  పిలుస్తే  దాని  పరివ్యసానం  మా వాడు  నిద్రపోయినట్లే  . అందుచేత  జో  వాకి లి  ముందు  బెల్  పక్కనే  పెద్ద  అక్షరాలతో  - గమనించవలసినది  వ్రాత  రూపంలో,  జో  మిత్రులు, దగ్గరవారు  జో  అని ఒక్క  సారి  పిలవాలి  లేదా  ఒక్క సారి  బెల్  వాయించాలి. అంతలేసి  అక్షరాలతో  రాసినప్పటికి  వాడి స్నేహితులు  రోడ్డు మీద  పిల్లి కూతలు, అనేక  సార్లు  పేరుతో  పిలుపు,  జో  నిద్ర పోవడం  ఖాయం . ఆ  అల్లరి  పిలుపుల కు  మాకు  నిద్ర పట్టకపోవడం  జరుగుతూనేవుంది. దీని  పరివ్యసానం, తోచక  చివరికి  ప్రసిద్ధ  మానసిక  వైద్యుని  సలహా  తీసుకోవడం  ఉత్తమంగా భావించాము.  ఇంకేముంది    టాటా  వారి  యల్లో  పుటలు  తిరగవేసి  ఒక డాక్టరు  వద్దకి

చేరగా  వాడు  నా చిన్నప్పటి   స్నేహితుడు , వెంకటాచలం   నామధేయం. నా  గోడంతా వాడి  ముందు  వ్యక్త పరచి  జోగాడి  ఈ  నిద్రా వస్తని  పోగొట్టవలసినదిగా, తర్వాత  మనస్సోల్లంసం  చేకూర్చి, ఈ  ఉపకారం  చేయవలసినదిగా   ఎంతో  ప్రాధేయపడి  ఎంతైనా  ఖర్చు  భరించగలమని, బతిమాలి  ఒప్పించాము . వెంకటాచలం జో  చుట్టరికాలు  తిరగ వేసి  ఈ  పోలిక  ఎవరిదో   అయి ఉంటుంది, పోలికలు  వస్తాయి  కదా !  అయినా  చేయవలసిన  ప్రయత్నాలు  మానడం  జరగదని  హామి  ఇచ్చాడు. No problems ! No problems !  అంటూ వుంటే  నాకౌక  నా పెళ్ళి రోజున  సంగతులు  జ్ఞప్తిక వచ్చాయి . చెపుదామని  మొదలు  పెట్టపోతుంటే   వెకటాచలం  ముఖం  అదోలా  పెట్టాడు. ఎందుకయిన మంచిదని  జో గాడి  సమస్య  అశ్రద్ధచేయవద్దని  చెప్పి  బయటపడ్డాము.

      జో .  .  . ఇంతగా  దిగజారి  పోతాడన్న  విషయం  వాడి  తల్లి, నా  మేనత్త  చెప్పగా  విన్నాను . ఆమె నద్ద చాలా  పైకం  గుంజడం  నేర్చుకుని, ఆవిడెకు  మనశ్శాంతి  లేకుండా చేసాడు. ఆవిడెలో  కూడా  తప్పుంది. ఎప్పుడో  మాటవరసకు - నీ తండ్రి  దండిగా  డబ్బు మూడు  తరాల  వారికి  సంపాదించాడు .  ఈ  మాట  అన్నందుకు    జో  .  .  ఉద్యోగం చేయడం  మానేసాడు . బాలివుడ్  లో చేరి  కిర్తి  గడించాలని  అదొక  యావ బయలుదేరింది  . జో .  . తల్లికి  ఒక   లాయరు  సలహాదారుడుగా   ఆమె చిరాస్థులను  కనిపెట్టుకొని  చాలా సంవత్సరాలుగా   పని  చేస్తున్నాడు.

     ఒకనాడు  ఆ  పెద్దమనిషి  నాకు  కబురు  చేసి  జో .  .  ని  ఘాటుగా  మందలించమని అన్నాడు.  అదీగాక  జో  .  .  ఇప్పుడు   బాలివుడ్ లో  ఉన్నట్లు   నమాచారం   వెల్లడి చేసాడు. వాని  స్నేహితురాలు  కూడా  అక్కడికే  చేరుతుందని  చెప్పాడు.  నీవొకసారి  ముంబయి  వెళ్ళి  జో  .  .  ఉనికిని  తెలుసుకుని  మామయ్య  హయాములో  మందలించ మని  సలహా  ఇచ్చాడు. తప్పనిసరిగా  మర్నాడు  ముంబయి  ప్రయాణం  చేయడం  అతి ముఖ్యమైన  అంశంగా  మారింది . రైలు  ప్రయాణం  సాగుతున్న  సమయం, అందులో  ఒక సాల్తీ  కనబడింది, తెలిసిన  మొహంలాగా  ఉంది. వచ్చి  నా  పక్కనే  కూర్చొని  రుమాలుతో  ముక్కు  చీది, విసుక్కొని   ఫాన్  సరిగ్గా  లేదని  సణిగి, రావుగారి  ఇస్టైలులో  హల్లో ! హల్లో ! మిమ్మల్ని  ఎక్కడో  చూసాను. ఇద్దరు  ఒకేసారి  పలికి  పగలబడి  నవ్వారు. చాలా  రోజుల తర్వాత  మరల  పరిచయం  అయినందుకు   చాలా  హుషారుగా  సంభాషణలు  జరిగాయి. నా మేనల్లుడు  బాలివుడ్  లో ఉన్నాడు  కదా, వాడిని  కలుసుకోవాలి. రెండు  సంవత్సరాల క్రిందట  తన  కుమారుని  పెళ్ళి  చూపుల  వ్యవహారంలో  అరుణను  చూసాడు.

      బాలివుడ్  లో  జో .  .  ని కలిసి , ఏంటోయి, మా  అందరిని  మరచి  పోయావా, జో .  .  (స్వగతంలో) ఈ  ముసలాడు  నాకెక్కడ  దాపరించాడు  ?   

       జో .   .   గ్లాసులు  వెంబడి  గ్లాసులు  కుళాయి  నీళ్ళలాగా  తాగేస్తున్నాడు. ఆ రు నెలలనుండి  హాయిగా  నిద్రపోతున్నాను, అప్పుడే  దాపురించాడు  !  నిన్ను  చూసి  చాలా రోజులయింది అందుకే వచ్చాను,  పళ్ళు ఇకిలించాడు. బాలివుడ్  స్వర్గలోకమనుకో,  సోమ రసాన్ని రుచి చూసేందుకు తండోపతండలు   నాలుక బయట  పెట్టి  లగెత్తుకుంటూ   వస్తారు. నీవుకూడా  ఆ  బాపతేమో  అనిపించింది. బొత్తిగా  మర్యాద  తెలియని  బాపతు  స్వగతంలో  అనుకుని  - పైకి  గంభీరంగా  - అతిగా  వాగకుండా  నే చెప్పేది  వళ్ళు  దగ్గర  పెట్టుకుని  విను   " నీవు  అరుణతో  వివాహం  నిశ్చయిం చుకున్నట్లు, నీ  తల్లి  ప్రమేయం లేకుండా  చేసుకుంటున్నావని, బాధ పడుతూ నాకు  వెల్లడిచేసింది. ” అరుణను  ఇప్పుడే  చూస్తావుగా, మాటల్లో  అరుణ  వచ్చేసింది. ఆమెయే  ఈమె.

     అదికాదోయి   జో  .  .  నీవు  మారిపోయావని  నాతో  అన్నావు  కదా !  నీవు  తాగుడు మానేయలేదు, రోజురోజుకి  దానికి  బానిస  అయిపోతున్నావు . . అందుచేత  నీవు 

వెంటనే బయలుదేరు.

ఎక్కడికి?

అదేమిటోయి  నా  పరిస్థితి  చూచి  నన్ను  బాగుచేయాలని   వేయి దేవుళ్ళకు  మొక్కి, నన్ను  వివాహమాడుతావని   శబధం  పట్టావు  కదా !  అప్పుడే  మరచినట్లున్నావు, ఇది  అన్యాయము  కదా !

  అరుణ, జో . . లు  సంభాషించుకునే  తీరు  చూడలేక  నిరాశ చెంది,  పాత  జ్ఞాపకాలు  నన్ను  చుట్టుముట్టాయి .

          సంఘటన లు  జరుగుతాయి, మనుష్యులు  పెరుగుతారు,  మనుగడలు  మారుతాయి.  నీతి  శాస్త్రం  ఇటువైపుదా,  అటు  ఉదయించిందా  పశ్నలేదు,  పురాణ

కాలంనాటిది.  ఇప్పటికి  వర్తిస్తుంది . పట్టణాలు  ముదిరి  నగరాలు  అవుతున్నాయి.  .

నగరాల  అభివృద్ధికి, వాటిగురించి   ఆధునిక  రచయితలు  గ్రంధాలను  ప్రచురిస్తున్నారు. ఈ  నగరాలలో  జనం  నివాశం  ఏర్పరచుకుంటున్నారు  . తమ  బ్రతుకు  బాటలను  అక్కడే  తీర్చిదిద్దటం  నేర్చుకుంటున్నారు. ఒక  నగరమే  కదా ప్రతి  నగరంలో  అనేక  రాష్ట్రాలనుండి  నగర  ఉన్నతికి, వ్యాపారంలో కాని, ఆధునిక  భవన  నిర్మాణంలో కాని, ప్రగతి  రూపంలో  విద్యా సంస్థల  నిర్మాణం   అనేక  విధావ  ముందు కు సాగుతున్నది.  తాను  బెంగూళూరులో   ఉన్నప్పుడు  సదాశివం, అంజలి  భార్యాభర్తల  జంట  పరిచయం ఏర్పడింది. అతడు  తెలుగు వాడు, ఆమె  తమిళ  యువతి. సదాశివం  చాలా  fast track  లో ఉంటాడు.  strike  when  the iron is hot, ఇంగ్లీషువాడు   భారతీయుని  తలలో  ముడి పెట్టాడు  కదా !  అప్పటికే  ఇరుగు  పోరుగు, అతడు  తెలుగు వాడు, ఆమె అరవ అమ్మాయేనట. ఇందులే  ఏముంది  - మద్రాసు, ఆంధ్రా పక్క పక్క  రాష్ట్రాలు. తెలుగు  రచయితలు  తమ నవలల్లో ఇంగ్లీషు  పదాలు, ఫ్రెంచి  వాళ్ళు  మరొక  భాష  పదాలు  ఉపయోగిస్తున్నారు   కదా!

    సదాశివం  తమిళ  భార్యను  పొందడానికి  కొన్ని  కారణాలున్నాయి.  ఒకటి తెలుగు  వాళ్ళంటే  సదభిప్రాయం  లేదు, ఇది  పుర్రెతో  పుట్టిన  బుద్ధి కాదు. సామాజిక  విలువలను  పైకం  లెక్కించినట్లు   ఒకటి, రెండు, మూడు  .  .  .  .  సంఖ్యలను  తన  డైరీ లో  రాసాడు. సదాశివం  మామయ్య  అంటాడు, తల్లి తండ్రుల వద్ద  ఉంటే  వారు  ఎక్కువగా  నేగ్  చేస్తారేమో, అందుచేత   దంపదుల  స్వాతంత్య్రా  నికి  ఆంటంకం  కలగవచ్చు. సదాశివం  తల్లి  అంటుంది ఎంత  పక్క  రాష్ట్రమయిన  వారి  సామాజిక  పద్థతులలో  చాలా  వత్యాసమున్నది. ఏది ఏమైనా  పిల్లలను  ఎత్తుకోవడం  మాట  అటు  ఉంచండి. వాళ్ళకి  సిరి  ఎత్తుకోవడం  వల్ల, తమిళ  వాళ్ళలాగ  చలామణి  అయ్యే  సౌలభ్యం  కలిగిందట. తెలుగు  గాలి  తగలకుండా జాగ్రత్త పడుతూ  తమిళ నాడు లో  స్థిర నివాశం  ఏర్పరచుకోవచ్చు. అటు  సదాశివం  తల్లి తండ్రులు  వాడు  ఎక్కడ  మాతృభాష  మరచిపోతాడో  ( జనం మతం మార్చుకున్నట్లు  ) వారికి  దిగులు  పట్టుకుంది. ఏది ఏమైన  ఒక్క సారి ఉద్యోగంలో  నిపుణత్వం  సంపాదించిన తర్వాత, ఈ కార్యక్రమాలలో   నెలకొంటున్న  వ్యాపరస్థులకు,  ప్రాంతీయ  వినియోగదారులకు  సంకర్షణ  రూపంగా  వ్యాపారవ్యవస్థ  లకు  భాషాజ్ఞానం   పొందటం,  అవశ్యకతలు  ఉంటాయి, తప్పదు . కాని  ఇతర ప్రాంతమునుండి   వచ్చిన  వారెంతో  భాష  నేర్చుకోవడానికి   ఔత్సుకత చూపుతారు . అక్కడ  నివశించేవారు  మిగతా  భాషలు  నేర్చుకోవడానికి   విముఖత  చూపు తారు.  అదీగాక  వారికున్న  తపన  సదాశివంకి  ఇంతవరకు  అవగతమవలేదు. ఆధునిక  యుగంలో  మనిషి  ఉన్నప్పటికీ, మనిషి  అన్న తర్వాత  కొన్ని నియమాలు  పాటించవలసి  ఉంది. మనిషి స్వాభావికమైన   పరిస్థితులలో  శృతి  కలుపుతే  బ్రహ్మాండమైన  నడవడితో  ఏ  పని  అయినా  సాధించగలడు. ఒక వేళ  మనస్సు  శూన్య  పరిస్థితిలో  ఉంటే  అత్యాశకు

తావుంది. ఈ  అత్యాశ  అనేక విధాలుగా  మనిషిలో  మార్పు  తీసుకువస్తుంది. ఆధునిక   పరంగా  చరవులతో  అతిమధురమైన, ఖరీదుగల  ఫర్నీచరు  అందుబాటులో  ఉన్నాయి. ఇంకా  సంపదకు  తగిన  భవన  నిర్మాణము , స్థిరాస్థి  సేకరణ , వీలైనపుడు  విదేశాలు తిరగడం, జల్సా జరుపుటకు  స్నేహితుల  రాకపోకలు, అనేకం  జరుగుతున్నాయి. సంపద పెంపు చేయడమే  పరమావధిగా  ఎంచకుండా, ఆ సంపదను  తగు విధముగా  ఉపయోగపడే  విధానం ఎంచుకోవాలి. సేవచేయడం వలన సాంఘిక  సామరస్యం  కూడా  ఒన  కూడుతుంది సౌహార్యం  నెలకొంటుంది. సేవలో, సహాయంలో, శిక్షణలో  ఆప్యాయత  ఉండాలి. ఆప్యాయత లేనిదే  తత్ఫలితం  సిద్ధించదు.  రెండవరకం వారు  కొత్త భాష  నేర్చుకునే  యావ  లేనందువలన  పూర్తిగా  విముఖంగా    ఉంటారు. ఎందుచేతనంటే  ఇందులో  వారికి  వచ్చే లాభం  శూన్యం. విద్యావిషయక   పరిస్థిగా  కాకుండా  సామాజిక  వ్యవస్థలలో  కలివిడి రూపొందించడం   ముఖ్యమయిన   అంశంగా  చూడాలి. ఈ  విషయాలలో  సాదాశినంకి, అతని  భార్యకి  అవగతమవటంలేదని   ఎక్కువగా  సంపాదన  పరంగా  సన్నివేశాలను  నిర్ణయిస్తునట్లు  వాని  తల్లితండ్రుల  విశ్వసిస్తున్నారు. అత్యాశకు  పోకూడదని  వారు చెప్పలేరు. మనుష్యులలో  ఆధ్యాత్మిక  గుర్తింపు  ఉండటంవలన   తామందరూ  భగవంతుని సంతానమని, వారి  తల్లి  ప్రకృతియేనని  గీత  ద్వారా  తెలిసిన  విషయమే. ప్రకృతిపరమైన  ఆదర్శాలు  తలకెక్కడం, ఒకరినొకరికి  సహాయం  చేయడం, ఆధునిక  పథములో  చాలా తక్కువ .

EditorialPhilosophyStoryArchitectureScienceFavourite LiteraturePoemsOthersAdvertisement Health

About us Contact usHome

 This site is best viewed in IE 5.0 and above with a 800x600 monitor resolution