|
»
Science |
Trouble viewing in Telugu, click here to
Download the Font |
|
|
|
|
|
పవనవాహితమైన కాలుష్య ప్రసరణ
కాలజ్ఞానం
-
విక్షేపణ |
|
Atmospheric
Pollution and Dispersion |
|
విద్యుత్
కేంద్రముల తొలి దశ
:
|
|
జల విద్యుత్ కేంద్రాలు, అణుకేంద్రాలు, కోల్ &
ఆయిల్ - గ్యాస్ విద్యుత్ కేంద్రాలు నిర్మాణానికి భారతప్రభుత్వం వనరలను కేటాయిస్తున్నారు. భారతదేశంలో అణుశక్తి సంస్థ,
అణుశక్తిని వినియోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో వారు
నిపుణులు. ఈ ఉత్పాదన విషయాలలో ఎలాంటి ప్రమాదము లేకుండా
అణుకేంద్ర శాస్త్రజ్ఞులు కృషి చేస్తున్నారు. జల విద్యుత్
కేంద్రాల మీద ప్రభుత్వం నిధులు వెచ్చించి నట్లైయితే, అది
వ్యవసాయాభివృద్ధికి,
మంచి నీటి సదుపాయాల కల్పనకు, జల మార్గ రవాణాకు అభి వృద్ధి
కి దోహదం చేస్తుంది.
అణుకేంద్రాలు నెలకొల్పుట వలన విద్యత్తు చౌకగా లభిస్తుందని కేంద్రముయొక్క ఉద్ధేశము. అయితే వీటివలన పర్యావరణానికి, నివశించే
ప్రజలకు హాని
కలిగిస్తుందనే ప్రశ్న ఉద్భవిస్తుంది .
భారతదేశంలో
అణు విద్యు త్ కేంద్రాలు అంతర్జాతీయ నిబంధలను ఖచ్చితంగా పాటించడం వలన
ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. భారతదేశంలో అణునియంత్రణాధికారాన్ని కలిగియున్న ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటర్
బోర్డ్ సమర్ధమైన ఒక సంస్థ.
సామాన్య ప్రజలకు అణు పరిజ్ఞానం వాటి యొక్క కొన్ని కొలతలు
తెలియడం ముఖ్యమైన ఒక అంశం . రేడియో ధార్మిక శక్తిగల కిరణాలు
వాటి మోతాదు గురించి, విద్యుత్
-
అయస్కాంత కిరణములు శరీరములో, పదార్ధములలో ప్రయాణం చేసే విధానాల
గురించి, అంతర్జాతీయ సమితి అణుకేంద్ర సంస్థలకు అండగా నిలబడి అనేక పరిమాణాల సూచనలను మానవ మరియు జంతు, క్రిమికీటకముల శరీరములలో, గాలిలో, నీటిలో, నీటిలోని జల చరములపై ప్రయాణించి
ఎంతవరకు హానికరముగా ఉండునో వారు వివరించారు . అలాగే అణుశక్తి
వలన కలిగే కాలుష్యం భూమిపై, గడ్డి, గాదము, |
|
 |
|
1. spread of atmospheric
pollutants |
|
వృక్షములపై
రేణువు రూపంలో పడినపుడు, పశువులు, జంతువులు, అవి మనుష్యులకు అందచేసే పాలు ద్వారా మనుష్యులకు లభించు మోతాదు గమనించతగునది. సముద్రములోగాని, నదిలోగాని కాలుష్యము నదలి వేస్తే జలచరములకు
రేడియో ధార్మికత వాటి పై ఉండే ప్రభావమువలన మానవులు కొన్ని
జలచరములను ఆరగిస్తే తద్వారా కలిగే మోతాదు చర్చనీయం. α , β , Ỵ
, neutron రేడియో ధార్మిక శక్తి వలన మనిషికి, జంతు, క్రిమికీటకములకు ,,
జలచరములకు కలిగే హాని గురించి సంవత్సరానికి ఎవ్వరికైన లభించే
మోతాదు ఈ సంస్థలు తగువిధముగా విలువలను సంస్థలు విశదీకరించారు.
ఈ కిరణముల శక్తి యొక్క మాపనలు అందరికీ కలిగే అనారోగ్య
స్థితి తెలుపగలవు. అనేక విధాలుగా నిర్వర్తించిన
ప్రక్రియలనుసారం అణు విద్యుత్ కేంద్రాలనుంచి అణు ధార్మిక శక్తి
విడుదల య్యే కాలుష్యాన్ని పరిమితిలో
ఉండేటట్లు
వారు చూడవచ్చు .
విద్యుత్ శక్తి ప్రజలకు ఎంతైనా అవసరముంది . సంప్రదాయ
వనరులు క్రమేపి సన్నగిల్లుట సర్వనిదితమే . అందుచేత అణుశక్తిచే
ఉత్పన్నమయ్యే విద్యుత్ శక్తికి పాశ్చాత్య దేశాలలో
ప్రాచుర్యంపొందింది. ప్రపంచంలో దాదాపు 31 దేశాలు
అణుకేంద్రాలను నెలకొల్పి, అణుశక్తికి ప్రాధాన్యతనిచ్చారు. పరిశ్రమలనుండి గాని, అణుశక్తి పరిశ్రమలనుండి గాని వాతావరణము
కాలుష్యమయినప్పటికీ, ఇందులో విడుదలయిన కాలుష్యము అతి తొందరగా
పలుచబడి రవాణా చెదుతుంది . ఈ కాలుష్యములో ఇందులో కల అంశములు
తెలియటం ఎంతైన అవసరముంది . వాతావరణం సంబంధించిన దృగ్విషయాలు
(pheno-menon)
మరియు కాలుష్యము మాటుమయ్యే విధానం కాలుష్య విక్షేపణకు
(dispersion) చెందినదే. కర్మాగారములనుండి వెలువడే కాలుష్య
వాయువులు విక్షేపణకు పాల్పడి, వాతావరణ పరిస్థితులబట్టి
ఎంతదూరమైనా తరలి పోగలవు . |
|
 |
|
2.
పగలు
వాతావరణములో కాలుష్యము యొక్క ఉద్గమం
ఈ విధమైన
కాలుష్యాన్ని తెలుసుకోవడానికి వెలుపలకి వెలువడే వాయువు
సాంద్రత
(pollutant density),
భూమి మీద రేణువుయొక్క వైశాల్యము ముఖ్యాంశములు , వీటిని
కొలవడానికి కావలసిన యంత్ర సామగ్రి గురించి తెలుసుకోవాలి. కర్మాగామునుండి వెలువడే పదార్ధ శకలం, వాయువులు వాతావరణంలో
ఉద్గమం (emmission)
పొందుతాయి |
|
 |
|
3. రాత్రి
సమయం వాతావరణములో కాలుష్యము యొక్క ఉద్గమం
. వీటి
నిర్జలీకరణ ప్రమాణమాపకం (resolution
of standard measure),
ఘనపరిమాణం ద్వారా అంచనా చేయబడుతుంది. కాలుష్యాన్ని
కాపరిణామానుసారం అనగా
లఘుకాల , దీర్ఘకాల ఉద్గమంబట్టి ఘనపరిమాణ కొలతలు
తెలియడంవలన రెడియో ధార్మిక కిరణాల విసర్ఝన మోతాదు మనిషికి, నివశిస్తున్న జనాభాపై వాటియొక్క దుష్పలితాల గురించి తెలుస్తుంది
జాతీయ, అంతర్జాతీయ స్థితిలో మోతాదుకి సంబంధించిన జాగ్రత్త
వ్యవస్థ ల విశ్లేషణ పరమైన దత్తాంశనిద్ధి తయారుచేయడంలో
శాస్త్రజ్ఞులు నిపుణత్వం పొందారు . ఈ నిర్ధిష్టాంశాల పుస్తకం
కర్మాగారా నిర్మాణం వరుస క్రమంగా
1. నివేశస్థలం
2.
నివేశస్థలం మూల్యాం కనం
3. కర్మాగారంయొక్క
సంక్రియ పద్థతులు
4. కర్మాగారం వలన
కలిగే అవాంతరాలు ఎదుర్కొనే ప్రణాళిక వ్యతిక్రమంగా నిర్మించిన
కర్మాగారము సంప్రదాయ పద్థతులు వేరుగాఉంటాయి . చరము వాతావరణములో
వచ్చే అవాంతరాలను ఎదుర్కొనే పద్థతులు విడిగా భద్రతా
పద్థతులపై పుస్తకము ప్రచురితమైనది .
( తర్వాత అంశములో వాతావరణ పరిస్థితులు
విచారించే అవసరములు కాలుష్యము యొక్క లక్షణాలు తెలియగలదు . ) |
|
|
|
|