|
ప్రకృతి మూలానా, హేతువాదం మూలానా లభించిన భగద్విషయక జ్ఞానం
వలన మానవుడు బ్రహ్మను నమ్ముతున్నాడు. అనాదిగా నెలకొని ఉన్న ఒక
శక్తిని ఒక స్వరూపంగా చూస్తూ ఆరాధించడం అలవరచుకున్నాము.
ఊర్జాపరమాణువు సిద్ధాంతం, ఆధునిక విశ్వశాస్త్రానుసారం,
మారమార్ధికత ఇవన్నీ సమఐక్యత కలిగియుండునట్లు తెలుస్తున్నది.
వైజ్ఞానికులు కనుగొన్న అనేక భౌతిక సిద్ధాంతాలన్నీ ఒకే ఒక
దివ్యశక్తికి చెందినవి అని విజ్ఞానశాస్త్రము తెలువుతున్నది.
విశాలమైన అంతరిక్షముయొక్క పరిధి తెలుసుకోవడానికి వైజ్ఞానికుల
గ్రహణశ్తికి అందదని వారు చెప్తున్నారు. వైజ్ఞానికులు
ప్రతిపాదించిన సర్వస్వసిద్ధాంతం ప్రకారం సూక్ష్మమైన కణంనుండి
ఈ విశాలమైన అంతరిక్షం వెలువడిందన్న సమాచారం అందరికి తెలిసిన
విషయమే.
విజ్ఞాన
పరిధిలో ఎన్నో విషయాలు తెలుసుకున్నప్పటికీ వైజ్ఞానికులు
చైతన్యమనే స్థితినుండి అదొక ద్వారమని గ్రహించి అనేక సంగతులు
గ్రహిస్తున్నారు. మానవుడు చైతన్యరహితంగా ఈ ప్రపంచమంతా ఊర్జాణు
సిద్ధాంతం వలన పరిగణింపబడుతున్నదని ఆలోచించడం భావ్యము కాదు.
మనస్సు ,
పదార్ధాన్ని సూక్ష్మీకరించలేని స్థితిని అర్ధంచేసుకోవడానికి
ఊర్జాణు సిద్ధాంతమెంతో ఉపయోగపడుతున్నది. అలాగే సూక్ష్మకణాలు,
తరంగాలు కలసియుండుట తథ్యము. విడతీయరాని స్థితిలో ఉంటాయి. ఐనస్టేన్ ప్రతిపాదించిన స్థలకాలమాన సిద్ధాంతములో కూడా ఇవి
ముడువడి ఉంటాయని చెప్పాడు. అలాగే పదార్ధము, చైతన్యవంతమయిన
స్థితి విడతీయరాని స్థితిలో ఉంటాయని వైజ్ఞానికులు చెప్పారు. ఈ
నిజాలు తెలుసుకున్న తర్వాత మానవుడు బ్రహ్మ స్వరూపాన్ని
మూఢనమ్మకంగా చూడలేడు.
|