|
తల్లితండ్రులు తమ పిల్లల పెంపకంలో ప్రగాఢమైన సాన్నిత్యము,
వాత్సల్యము చూపుతున్నారు.
రోజు మొత్తంలో వేరే అవసరాలవలన కొన్ని గంటలు వారితో
గడపలేక
పోతున్నారు. దాని వలన కొంత ఆందోళన చెందుతూ, అశ్రద్ధతా పరిధి
దాటకుండా, వారు కొన్ని సూత్రాలను పాటిస్తున్నారు. సుళువైన,
అనువైన కొన్ని పద్థతులను అవలమబించే ప్రసక్తి వచ్చినప్పుడు,
తల్లితండ్రులకు వసతులు ఉండటం వలన వారి పిల్లలనుబాధ్యతగల సంరక్షణా కేంద్రాలలో ప్రవేశపెడుతున్నారు. తల్లితండ్రులు వారి
వారి పిల్లలతో గడప నవసరములేదు. ఈ కేంద్రాలు పిల్లలకు ఏ లోటు
లేకుండా, తల్లితండ్రుల ప్రమేయము లేకుండా, ఎటువంటి బాధ లేకుండా
ఉపసమనం కలిగిస్తున్నరు. కాని సంరక్షణాకేంద్రాలకు కూడా అన్ని
వసతులు కలిగించ డానికి కొన్ని సమస్యలుంటాయి. అందుచేత ఈ తల్లి
తండ్రులు సరియైన కేంద్రాలను వెతకటంలో కాలం వృధా చేయవలసి
ఉంటుంది. అయినప్పటికీ మనకు కావలసిన సంస్థలు అందుబాటులో
ఉండకపోవచ్చు. ఇంటువంటి సమస్యలు మామూలే అని తల్లితండ్రులు అంటారు.
లేదా తాత,
అమ్మమ్మ లేక
తాత,
మామ్మ ఉన్న పరిస్థితులలో పిల్లల సంరక్షణ ఒకందుకు మంచిదే.
అందుకే
Alfred
Hitchcock ఇలా అన్నాడు "A good film was one that was with the
price of dinner, admission and a baby sitter. Back then the baby
sitter was the cheapest part of the evening.”
అమెరికాలో
ఇంటర్ నెట్ ద్వారా పిల్లల సంరక్షణకి ఒక వ్యక్తిని కొన్ని
గంటలకు ఇంటికి పిలవవచ్చు.
1990 సంవత్సరంలో అమెరికాలో
Red Cross
సంస్థ పిల్లల పెంపకం విషయంలో అనుకూలమైన బాట సృష్టించి,
ఈ విద్య
నేర్చుకోవడానికి కావలసిన పాఠశాలలను నిర్మించారు. దీనికి
11 సంవత్సరముల నుండి
17 సంవత్సరముల వరకు క్షాత్రకులను
ప్రవేశపెట్టి సంస్థను నడుపుతారు. విద్యార్ధులు తాము
చదువుకుంటూ రోజుకి నాలుగు గంటలు పిల్లల సంరక్షణ కేంద్రం
నడపవచ్చు. |